Popular Posts

This is Sanjay and it's my story

Hi ,
Good Morning to all....
నా పేరు సంజయ్. పూర్తి పేరు సంజయ్ బోడ. ఇది  నా కథ. నా జీవితంలో జరిగిన యదార్థ గాథ, సంగటనలు ఒడిదుడుకులు అన్ని రాస్తే ఓ సినిమా స్టోరీలా అవుతుందనే రాసుకుంటున్నా....

నాకిప్పుడు 24 ఏళ్ళు.  ఈరోజు శుక్రవారం 09-11-2012 ఉదయం 10.00 Am, చందానగర్, హైదరాబాద్.


నా చిన్నతనం,
నేను  పుట్టింది అమ్మమ  వాళ్ళ ఇంట్లో అంట ,  వాళ్ళది మహారాష్ట్ర లో   చంద్రపూర్ జిల్లాలోని భద్రవతి అని ఊరు దగ్గర ఓ తండ . నాకు ఆరు నెలలు వచ్చేవరకు అక్కడే ఉంచారట.
ఆ తరువాత మా  ఇంటికి  తిసుకోచేసారట .

అన్నట్టు మాది వరంగల్ జిల్లాలోని గూడూర్ మండల్ లో  గుండెంగ  అనే ఊరు . ఆ  ఊరిలో  52 తండాలు ఉంటాయి. మాదే పెద్దది నేను పెరిగిందంతా అక్కడే.

నా చిన్నపుడు  నేను ఆడుకుంటుండగా మా ఇంట్లో ఉన్న పురుగుల మందు తగేసనంత మా  బాబాయ్ చెప్పేవాడు అప్పుడు ఆయనకి 13 ఏళ్ళు లంట. ఆ రోజు బాబాయ్ ఇప్పటికి చెప్తుంటాడు. బాగా ఎద్చేసరంతా పాపం

నాకు 5 ఏళ్ళు వచేసాయ్ కానీ నేను స్కూల్ కి వెళ్ళట్లేదు అలగే ఇంకో రెండేళ్ళు గడిచిపోయాయి . అప్పుడు మా ఇంటికి ఓ సారి మా తాతయ్య  గారు  వచ్చారు . మా అమ్మ ఆయనతో నా గురించి చెప్పింది స్కూల్ కి వెళ్ళట్లేదు అనీ. ఆ రోజు మా  ఇంట్లో  వాళ్ళు అందరు పనికి వెళ్ళిపోయారు నేను తాతయ్య  మాత్రమే ఇంట్లో ఉన్నాం. ఆ రోజు ఆయన నను ఇంటి చుట్టూ  తిప్పి కొట్టారు తొడపాశం  వేసారు. ఆ మరుసటి రోజునుంచి నా స్కూల్ ప్రస్థానం మొదలైంది .నేనిప్పుడు B .Tech complete చేసి M .Tech చేయబోతున్నాను .

నేను విద్యాబ్యాసం చేసిన స్కూల్ శ్రీ అరుణస్కూల్ గుండెంగ . చినిగిన  లాగు చొక్కాలు వేసుకుని బస్తాలతో చేసిన సంచి  వేసుకుని ఆడుతూ పడుతూ సాగుతుంది నా  జీవితం. మా స్కూల్ లో నేను ఎక్కువగా 3rd  rank వచేవాడిని అప్పుడప్పుడు మాత్రం 2nd వస్తాను . 1st  మాత్రం ఎప్పుడు ఒక్కడే అతని పేరు బాదవత్ భాస్కర్ వాడికి అప్పటికే వ్యవసాయం కూడా వచ్చు . స్కూల్ ఫీ కట్టటానికి వాడు మా సర్ వాళ్ళ పనికి కూడా వెళ్ళేవాడు ఇంకా    సెకండ్ అంతర అతఃని పేరు కూడా భాస్కర్ ఇంటి పేరు భూక్య , తను రోజు మార్నింగ్ 4am కే లేచి మా ఐ ఇంటివరకు వినిపించేలా చదివేవాడు దాంతో  మా అమ్మ నన్ను లేపి చదవమనేది నేను కూడా అంతే ఫోర్సుతో మా తండ అంత వినిపించేలా చదివేవాడిని .ఇంకో విషయం ఏంటంటే వాడికి 4th class లోనే వడ్డీ లెక్కలు వచేవి దానితో వాడు మా తండాలో పాపులర్ అయ్యాడు . మా class లో ఇద్దరు నవల,కృష్ణవేణి. మా స్కూల్ లో నాకు చాలా ఇష్టమైన  టీచర్  , సర్ ఉన్నారు madam పేరు సహేద బేగం సర్ పేరు తిరుపతి రెడ్డి ఇంగ్లీష్ & maths చెప్పేవారు madam ఏమో hindi        చెప్పేది మొత్తానికి నా 6th వరకు అంత మా ఊరిలోనే గడిచింది . మా స్కూల్ లో 7th  class లేదు దాంతో నేను hanamkonda  లో చదవటానికి వచేసాను దాదాపుగా మా స్కూల్ అంత మల్లి hanamkonda కి వచ్చేసాం . అందరం మల్లి ఒకే స్కూల్ "శ్రీ చంద్ర మెమోరియల్ హై స్కూల్" రెడ్డి కాలనీ హనంకొండ . నా జీవితం లో నేను వేయబోతున్న తప్పటడుగులు ఇక్కడినుంచే మొదలయ్యాయి.

7th కి వెళ్లేముందు నా పేరు పవన్ కుమార్  గా మార్చుకున్నాను. 

7th class లో కూర్చున్నాం. బాగానే గడిచింది . 8th  class  కి వచేసరికి city అంత రౌండ్ వేయడం తెలుసుకున్న.దాంతో 9th class  సరిగా వెళ్ళలేదు 2003 లో 10th కి వచ్చాను . నవంబర్  లో exam  fee date వచ్చింది.  కానీ నా fee వాళ్ళు తీసుకోలేదు . కారణం నేను స్కూల్ కి సరిగా వెళ్లకపోవడం నా కోసం నన్ను వెతుకుతూ మా P .T .సర్ వచ్చేవారు ఆయన బైక్ సౌండ్ వినిపించగానే గోడ దూకి పారిపోయేవాడిని . అప్పుడు మా class teacher    ఓ  సలహా  ఇచ్చారు వెళ్లి సర్ కళ్ళు పట్టుకో అని దానితో నా ego hurt  అయింది నాకి చదువు వద్దు అని మా నాన్న తో తాతయ్య  తో చెప్పేసాను అప్పుడు వాళ్ళు వచ్చి మా సర్  ని బతిమిలాడారు  కానీ అయన ఒప్పుకోలేదు దాంతో మా నాన్న నా ట్రంకు పెట్టె ఎత్తుకుని ఇంటికి తిసుకోచ్చేసారు పర్వాలేదు కొంచం గట్టిగానే కొట్టారు ఎం చేయలేని పరిస్తితి . నిజానికి నేను class కి ఎందుకు వెళ్లలేదంటే ఆది 2002 అనుకుంటా ఖుషి సినిమా  50 రోజులప్పుడు అమృత థియేటర్ లో వచ్చింది . నేను రాము (రామ్ కోటి ) రోజు ఆ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం అలా ఆ వారం లో 14 సార్లు చూసాం ఆ సినిమాని దాంతో నా   చదువు కాస్త అటకెక్కింది.

అలా అప్పుడు నాకు ఓ సంవత్సరం పాటు వేస్ట్ అయ్యింది . మా తండాలో ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు ఇంటర్ 1st  year చదువుతున్నారు . అందులో చందూలాల్ అనే అతను ఓ చాక్ పీస్ ముక్క  తీసుకొచ్చి  మా class  లో ఇది చెప్పారు అది చెప్పారు అని ఎప్పుడు అంటుండేవాడు . దానితో నాకు అనిపించేది  నేను కూడా చదివి ఉంటే ఇప్పుడు ఇలా సంతోషంగా వీళ్ళతో నా  education గురించీ మాట్లాడుతూ  ఉండేవాడిని కదా అని. అప్పుడు బాగా ఆలోచించాను, మేము కూడా చదువుకోవాలి అనుకున్నాను ఎవరు ఏమనుకున్న సరే చదువుకోవాలి అంతే అనుకున్నా . పాపయపేట లో విస్వప్రగతి గురుకుల  విద్యాలయం లో నా పక్క తండ నుంచి ఇద్దరు అబ్బాయిలు వెళుతుండేవారు . వాళ్ళని హెల్ప్ అడిగాను . ఆ స్కూల్ హెడ్ మాస్టర్  వెళ్లి ఇలా 10th  అబ్బాయి ఉన్నాడు మన స్కూల్ లో వస్తా అంటునాడు అనీ విషయం ఏంటంటే నేను హనంకొండ నుంచి  వచేసాను కానీ నా T C తీసుకోలేదు అక్కడే ఉండి  పోయింది. అందుకే T C  లేకుండానే జాయిన్ అవ్వాలి అందుకే అడిగి తెలుసుకో అని , డబ్బులు వస్తాయంటే ఎవరినైన చేర్చుకుంటారు ఆయన. 2004 సెప్టెంబర్  లో వెళ్లి 500 కట్టి జాయిన్ అయ్యాను .నేను నా చదువు మద్యలో వదిలేయటానికి పవన్ కళ్యాణ్ నే కారణమని పవన్ కుమార్ అనే పేరు నాకు అచ్చు రాలేదని తిరిగి నా అసలు పేరుతోనే మొదలుపెట్టాను. అలా   నా చదువు మల్లి స్టార్ట్ అయ్యింది . నేను మల్లి చదువుకోవటానికి చందూలాల్ గాడే కారణం. వాడు అలా వచ్చి తన చదువు గురించి చెప్పి ఉండకపోతే నాకు ఈ పాటికి పెళ్లి అయి  ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యేవాడినేమో . అలా ఆ సంవత్సరం నుంచి 2005 మార్చిలో 10th  అయింది .

ఆ summer  లో ఈత కొట్టడం బావిల చుట్టూ దూకడం   ఆడుకుంటూ తిరగడంతో holidays గడిచిపోయాయి . ఇంటర్ ప్రజ్ఞ జూనియర్ కాలేజీ లో వెళ్ళటానికి ఆ కాలేజీ లో addm  కూడా   తీసుకున్నాను కానీ లింగమూర్తి గాడి ఫ్రెండ్ పేరు సురేందర్ వచ్చి ఉపదేశం ఇచాడు ఎవడో తిండి పెడితే నువ్వు ప్లేట్ పట్టుకుని నిలబడటం ఏంటి నున్ను              డబ్బులు కట్టి వాళ్ళు పెట్టిందే  తినడం అవసరం  నీకు  నువ్వు మహబూబాబాద్ కి వచెయ్ రూమ్ తీసుకోని  ఉండు నీకు 2500/- ఇప్పిస్తాను అని చెప్పి  మహబూబాబాద్ లో జాయిన్ అయ్యేలా చేసాడు . అది 2005 జూన్ లో విజ్ఞాన భారతి  జూనియర్ కాలేజీ లో జాయిన్ అయ్యాను డిసెంబర్ వరకు బాగానే చదివాను. అప్పటి వరకు మా class లో పర్వీన్ అనే పేరు తో ఓ ముస్లీం అమ్మాయి ఉందని కూడా నాకు తెలియదు నా మనసుకి ఆ అమ్మాయి నచ్చింది . ఆమె గురించే ఆలోచనలు . అప్పుడే  మార్చిలో exams  వచ్చేసాయ్ .  english  exam ముందు రోజు బాలు  నా material నుంచి ఓ పేపర్ చింపేసి తన ఫ్రెండ్ కి ఇచేసాడు . ఆ రోజు  వాడిని బాగా తిట్టేసాను . అది నేను ముందుగ చదివివుండకపోతే కచ్చితంగా ఫెయిల్ అయ్యేవాడిని. ఎట్టకేలకి exams అయిపోయాయి . 1st  year  లో ఓ sub ఫెయిల్ అయ్యాను . దాని ప్రభావం, ఆ అమ్మాయి  2nd  year పైన  పడింది  . దాంతో 2nd  year  కాలేజీ కి సరిగా వెళ్ళలేదు. afternoon  class  ఎప్పుడు వినలేదు . అంతలోనే ఫైనల్ exam వచేసాయి. ఈసారి  3 sub  ఫెయిల్ అయ్యాను మల్లి. supply లో 2sub పాస్ అయ్యాను కానీ 2nd  MB మాత్రం మరో సంవత్సరం పాటు ఆపింది. నన్ను దానితో అక్కడి నుంచి తిరిగి హనంకొండ కి వచ్చి PGDCA కోర్స్  లో జాయిన్ అయ్యాను  . పార్ట్  టైం జాబ్ కూడా చేశాను నాచక వదిలేసాను. జనవరి  వరకు అక్కడే ఉండి తిరిగి మహాబుబబాబాద్ కి వచ్చి చదివి పాస్ అవ్వాలి అని చదవటం స్టార్ట్ చేశాను అప్పుడు పాస్ అయ్యాను  B .tech  చెయ్యాలి అనుకున్నాను అప్పుడు మహిళా సంఘాల తరుపున కోచింగ్ కి నారాయణ కాలేజీ హైదరాబాద్ కి పంపించారు . అందులోను సరిగా ఉండకుండా మద్యలో వదిలి వచేసాను . may  8th 2008 ఎంసెట్ exam  జరిగింది  ఆ తరువాత సెప్టెంబర్ వరకు ఖాళీగానే ఉండవలిసి వచ్చింది  కొందరు అయితే నువ్వు B .tech  ఎం చేస్తావ్   వెళ్లి డిగ్రీ లో జాయిన్ అవ్వు అని ఉచిత సలహా కూడా ఇచ్చారు . ఆగష్టు లో కౌన్సిలింగ్ జరిగి సెప్టెంబర్ లో 24 జాయిన్ డేట్ కూడా వచ్చింది . అప్పుడు కాలేజీ లో development fee  10000/- కట్టాలి అని ఎవరో అన్నారు . నా దగ్గర అంత డబ్బులు లేవప్పుడు. అందుకే మా మామయ్య దగ్గర ఓ 5000/- సర్దమని చెప్పను కానీ ఆయన కూడా ఇవ్వలేదు అప్పుడు మా నానమ్మ వాళ్ళ అల్లుడు mansingh ఇచారు.అప్పుడే అనిపించింది "చప్పట్లు కొట్టేవాల్లును మర్చిపోయిన తప్పులేదు కానీ చేయుతనందించే వారిని మర్చిపోకూడదు " అని .అలా సెప్టెంబర్ 18th  నా  హైదరాబాద్ సిటీ కి వచాను .  జంప కి ఫోన్   చేసి చెప్పను అప్పుడు తనే నన్ను  మొదటిసారిగా మా కాలేజీ చూపించారు . అలా కాలేజీ చూసి రూం సెట్ చేసుకుని తిరిగి ఇంటికి  వచ్చేసాను .

2008 సెప్టెంబర్  24 కి RRS  College of  engineering and  technology  లో  B .tech  1st  year  IT  Branch

నా B .Tech  జీవితం start ....

24 సెప్టెంబర్ 2008
రోజు కాలేజీ కి వెళ్లి జాయిన్ అయ్యాను.
మరుసటి రోజు నుంచి కాలేజీ కి వెళ్ళడం మొదలు పెట్టాను.  అవి హ్యాపీ డేస్ సినిమా రోజులు, B.Tech Life  కూడా అలాగే ఉంటాదేమో అనుకున్నాను . జాయిన్ అయిన 10 రోజుల్లోనే ఎవరికీ వారు గ్యాంగ్ maintain చేయడం మొదలు పెట్టారు. అప్పుడే నాకు కృష్ణ ప్రసాద్ రెడ్డి పరిచయం అయ్యాడు.