Popular Posts

Sanju in vizag

10/11/12 శనివారం సాయంత్రం 3.30 pm చందానగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి బయలుదేరాను .

సికింద్రాబాద్  సాయంత్రం 5.30 pm గోదావరి ఎక్ష్ప్రెస్స్ 1 hour  late గా వచ్చింది. 6.30 pm  కి train వచ్చింది జనరల్ బోగి నిలబడటానికి కూడా place లేకుండా ఉంది train. బయలుదేరుతుండగా foot board ఎక్కి నిల్చున్నాను. రైలు జోరందుకుంది. చల్లటి గాలి తో మొదలైన ప్రయాణం చలిగా మారి వణికిస్తోంది. వరంగల్ వరకు foot board పైన ఉంది తరువాత లోనికి వెళ్ళిపోయాను. విజయవాడ చేరుకునేసరికి రాత్రి 12.30 am అయ్యింది. అప్పటికే ఆకలి వేస్తుంటే వెళ్లి egg  biryani తీసుకుని తినేలోగా మళ్ళి train  start అయ్యింది.నీలం తుఫాన్ effect అనుకుంటా విజయవాడ నుంచి విశాకపట్నం వెళ్లేదారి గుండా భారీగా మంచు కురుస్తోంది. ఆ చలిలో చాలా కష్టంగా నా ప్రయాణం సాగింది.

11/11/12 ఉదయం 7.30 am కి వైజాగ్ కి చేరుకున్నా. ఆంధ్రాకి కి రావడం ఇదే మొదటిసారి .
స్టేషన్ లో  బ్రెష్ చేసుకుని బయటికి వచ్చి ఓ దమ్ముకొట్టి తిరిగి వస్తుండగా శేషు కుమారి ఫోన్ చేసింది 30 min  లో వస్తాను అని చెప్పి పెట్టేసింది. నేను మల్లి స్టేషన్ కి వెళ్లి fresh up అయి బయటికి వచ్చి లక్ష్మి తో మాట్లాడుతూ నిల్చున్నాను. అంతలోనే శేషు వచేసింది. తనని నేను అసలు గుర్తుపట్టలేక పోయాను అంతలా మారిపోయింది. 3 సంవత్సరాలు అయింది తనని చూసి.  అక్కడినుంచి ఇద్దరం కలిసి నా exam center  కి వెళ్ళిపోయాం.
9.50 am కి exam  center  లోకి వెళ్ళిపోయాను.(D .A .V . Public School (center )) fci exam సెంటర్ వైజాగ్ లో పడింది.అందుకే అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. 12.00 pm కి exam అయిపొయింది. బయటికి వచ్చి వైజాగ్ చూడటానికి బయలుదేరాం.మద్దేలపాలెం నుంచి భీమిలి కి వెళ్లి అక్కడే లంచ్ చేసి తిరిగి బీచ్ దారిగుండా చూసుకుంటూ కైలషగిరి కొండ ఎక్కి అక్కడి నుంచి R .K బీచ్ కి వేల్లిపోయం. కాలినడకన బీచ్ లో నడుచుకుంటూ అలా ఓ ఉంగరం తీసుకోని ముందుకెళ్ళి బస్సు ఎక్కేసి జగదంబ సెంటర్ లో దిగి అక్కడ కాసేపు తిరిగి R.T .C  కాంప్లెక్స్  కి  అక్కడి నుంచి శేషు వాళ్ళ office  కి వెళ్లి తన ఫ్రెండ్స్ ని కలిసి బక్కడే నూడుల్స్ తినేసి,తను  రైల్వే స్టేషన్ వరకు వచ్చి టికెట్ ఇప్పించి వేల్లిపోఇంది . నేను  ఆ టికెట్ cancel చేఇంచి పాసెంజర్ టికెట్ తీసుకోని ట్రైన్ లోకేల్లి పడుకున్నాను.

12/12/12 విజయవాడ రైల్వే స్టేషన్
ఉదయం 9.00 am రైలు దిగి బయటికి వచ్చి ముందు  దమ్ముకొట్టి తిరిగి స్టేషన్ కి వచ్చి ఎంక్వయిరీ కౌంటర్ లో ట్రైన్ గురించి అడిగి తెలుసుకుని వెళ్లి టికెట్ తీసుకుని వస్తుండగా మమత ఫోన్ చేసి తిన్నావా అని అడిగి పెట్టేసింది. అంతలో ట్రైన్ వచేసింది. ఎక్కి foot  బోర్డు దగ్గర కూర్చున్నాను. మధిర వరకు బాగానే ఉన్నాను. ఆ తరువాతనే నిద్ర రావడం మొదలైంది. పడుకున్నాను. సికింద్రాబాద్ చేరుకునేసరికి సాయంత్రం 05.08 pm  అయింది.రూమ్ కి వచ్చి తినేసి బస్స్టాప్ సినిమా కి వెళ్ళిపోయాను. బాగుంది మూవీ.

                                                                                             సంజు...